మేనకోడలుతో పాటు మేనల్లుడు కూడా..!

Mahesh babu Son In Law Ashok Galla entry into movies

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు సోదరి మంజుల ఒక చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉంది. ఆమె హీరోయిన్‌ కావాలని కోరుకున్నా కూడా కొన్ని కారణాల వల్ల హీరోయిన్‌ అవ్వలేక పోయింది. తన కోరికను తన కూతురు రూపంలో తీర్చుకునేందుకు మంజుల ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మంజుల తన కూతురును భవిష్యత్తులో హీరోయిన్‌గా చేసేందుకు ఇప్పటి నుండే ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం తాను సందీప్‌ కిషన్‌ హీరోగా చేస్తున్న ఒక చిత్రానికి దర్శకత్వం వహిస్తుంది. ఆ సినిమాలో కూతురును పరిచయం చేయబోతుంది. మహేష్‌బాబు మేనకోడలుతో పాటు ఆయన మేనళ్లుడు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

Mahesh sister Manjula Dughter Jahnavi to do special role in Sundeep Kishan Movie

మహేష్‌బాబు మరో సోదరి కుమారుడు అయిన గల్లా అశోక్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. టీడీపీ నాయకుడు, ఎంపీ గల్లా జయదేవ్‌ కుమారుడు అయిన గల్లా అశోక్‌ గత రెండు సంవత్సరాలుగా నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. యాక్టింగ్‌, డాన్స్‌, ఫైట్స్‌ ఇలా అన్ని విభాగాల్లో కూడా అశోక్‌ పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్నాడు. మహేష్‌బాబు ఆశీర్వాదంతో అశోక్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అశోక్‌ బాధ్యతను నిర్మాత దిల్‌రాజుకు గల్లా జయదేవ్‌ అప్పటించాడు. ప్రస్తుతం అశోక్‌ కోసం ఒక మంచి కథను తయారు చేయించే పనిలో దిల్‌రాజు ఉన్నాడు. కొత్త దర్శకుడి దర్శకత్వంలో అశోక్‌ సినిమా ఉండబోతుందని సమాచారం అందుతుంది.

Ashok-Galla

ఇప్పటికే సూపర్‌ స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ నుండి మహేష్‌బాబు, సుధీర్‌బాఋ హీరోలుగా ఉన్నారు. త్వరలోనే రమేష్‌బాబు తనయుడు కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఆలోపే జయదేవ్‌ తనయుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ చాలా ఆనందంగా ఉన్నారు. కృష్ణ మనవడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో ఫ్యాన్స్‌ ఆయన్ను సాదరంగా ఆహ్వానించేందుకు సిద్దం అవుతున్నారు. వచ్చే సంవత్సరం ఆరంభంలో సినిమాను షురూ చేయబోతున్నారు. దిల్‌రాజు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు మొదలు పెట్టాడు.