అజ్ఞాతవాసి… పవన్‌ లుక్‌ రచ్చ

Pawan Kalyan Agnathavasi First Look

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
పవన్‌ కళ్యాణ్‌ 25వ చిత్రం టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. చాలా నెలలుగా ఈ చిత్రానికి ‘అజ్ఞాతవాసి’ అంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. పవన్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో సినిమా అనగానే అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి అజ్ఞాతవాసి అంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నా కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం పెద్దగా స్పందించక పోవడంతో మరేదైనా టైటిల్‌ను ఖరారు చేస్తారేమో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని చివరకు అజ్ఞాతవాసిని ఖరారు చేయడం జరిగింది. టైటిల్‌ విషయంలో త్రివిక్రమ్‌ మరోసారి తన వైవిధ్యంను చూపించాడు.

ఇటీవలే ప్రీలుక్‌ను విడుదల చేసి ఆసక్తిని పెంచిన త్రివిక్రమ్‌ తాజాగా పవన్‌ కళ్యాణ్‌ ఫుల్‌ లుక్‌ను రివీల్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేశాడు. ఒక సాప్ట్‌వేర్‌ ఉద్యోగిగా ఈ చిత్రంలో పవన్‌ కనిపించబోతున్న విషయం తెల్సిందే. చాలా అందంగా అద్బుతంగా పవన్‌ కళ్యాణ్‌ను త్రివిక్రమ్‌ ఈ చిత్రంలో చూపించబోతున్నట్లుగా ఈ లుక్‌ చూస్తుంటేనే అనిపిస్తుంది. రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతూ ఫిజిక్‌ గురించి పవన్‌ ఈ మద్య ఎక్కువగా పట్టించుకోవడం లేదు. దాంతో ఈ చిత్రంలో కాస్త అటు ఇటుగా కనిపిస్తాడేమో అని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కాని పవన్‌ మాత్రం అందరి అంచనాలను తలకిందు చేస్తూ అత్తారింటికి దారేది చిత్రంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. మరోసారి పవన్‌ ఫ్యాన్స్‌కు పండగ ఖాయం అని ఈలుక్‌ చూస్తేనే అనిపిస్తుంది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా కీర్తి సురేష్‌ మరియు అను ఎమాన్యూల్‌లు నటిస్తున్న విషయం తెల్సిందే.

అజ్ఞాతవాసి... పవన్‌ లుక్‌ రచ్చ - Telugu Bullet