తండ్రికి తగ్గ తనయుడు

తండ్రికి తగ్గ తనయుడు

తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు గౌతమ్‌ ఘట్టమనేని. సినిమా కోసం మహేశ్‌బాబు ఏ రకంగా కష్టపడతాడో అందరికి తెలిసిందే. దర్శకుడు ఆశించిన జౌట్‌పుట్‌ని అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తాడు. అవే లక్షణాలు ఆయన తనయుడు గౌతమ్‌కి వచ్చాయి. ఏ పని అయినా మొదలుపెడితే దాంట్లో ది బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. తాజాగా ఆయన సాధించిన ఓ ఘనతే దానికి నిరద్శనం. తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్‌ పోటీలో టాప్‌ 8 ఈతగాళ్ల లిస్ట్‌లో స్థానం సంపాదించాడు గౌతమ్‌.

15 ఏళ్ల వయసులోనే ఆయన ఈ ఘనత సాధించాడు. తన కొడుకు సాధించిన విజయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది మహేశ్‌ సతీమణి నమ్రత. గౌతమ్‌ నీళ్లలో 5 కిలో మీటర్ల దూరాన్ని 3 గంటల్లో ఈదగలడని చెప్పుకొచ్చింది. గౌతమ్‌ బటర్‌ఫ్లై, బ్యాక్‌స్ట్రోక్, బ్రెస్ట్‌స్ట్రోక్ , ఫ్రీస్టైల్ అనే నాలుగు పద్ధతుల్లో ఈత కొడతాడని, అతనికి ఫ్రీస్టైల్ అంటే బాగా ఇష్టమని చెప్పింది.

ఇక తమ అభిమాన హీరో కొడుకు స్విమ్మింగ్‌లో రికార్డు క్రియేట్‌ చేయడంతో.. మహేశ్‌ ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అని కొనియాడుతున్నారు. కాగా, గౌతమ్‌ ఘట్టమనేని మహేశ్‌ హీరోగా నటించిన ‘1 నెకొక్కడినే’లో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.