స్పైడర్‌ సెన్సార్‌ టాక్‌.. దుమ్మురేపడం ఖాయం

mahesh-babu-spyder-censor-talk

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మహేష్‌బాబు, మురుగదాస్‌ కాంబినేషన్‌ అనగానే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా ఉంటుందని, టీజర్‌, ట్రైలర్‌ చూసిన తర్వాత నిర్థారణ అయ్యింది. మహేష్‌బాబు కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం మరియు మలయాళంలో కూడా విడుదల కాబోతుంది. దసరా కానుకగా ఈ నెల 27న విడుదల కాబోతున్న ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్‌ నుండి వచ్చిన టాక్‌ చూసి ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి.

విడుదలకు ఇంకా పది రోజులు ఉండగానే చిత్ర యూనిట్‌ సభ్యులు సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేయించడంతో సినిమాకు ఏ రేంజ్‌లో ప్రమోషన్‌ చేయబోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చిన సెన్సార్‌ సభ్యులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా శివ పాత్రలో మహేష్‌బాబు నటన సౌత్‌లో ఏ స్టార్‌ హీరో చేయలేడు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. విలన్‌ పాత్రలో ఎస్‌జే సూర్య అద్బుతం అని, దర్శకుడు మురుగదాస్‌ కథను నడిపించిన తీరు సౌత్‌ రేంజ్‌ దాటిపోయింది అంటూ ఒక సెన్సార్‌ సభ్యుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆయన వ్యాఖ్యలు సినిమా స్థాయిని అమాంతం పెంచాయి. మూడు భాషల్లో కలిపి ఈ సినిమా 250 కోట్లు వసూళ్లు చేస్తుందనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులున్నారు. మరి ఆ స్థాయిలో ఈ సినిమా వసూళ్లు సాధిస్తుందా అనేది చూడాలి.