స్పైడర్ రేటింగ్ 3 . 5

Mahesh Babu Spyder Telugu movie Review Rating
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సూపర్ స్టార్ మహేష్ హీరోగా చేస్తున్న స్పైడర్ మూవీ మరికొన్ని గంటల్లో విడుదలకి సిద్ధంగా వుంది. తెలుగు, తమిళ భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు వున్నాయి. మహేష్, మురుగదాస్ కాంబినేషన్ సినీ లవర్స్ ని ఊరిస్తోంది. ఈ సినిమా ఎలా వుండబోతోంది అని మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వారి ఉత్సాహాన్ని ఇంకాస్త పెంచే మ్యాటర్ ఇప్పుడు బయటికి వచ్చింది. దుబాయ్ లో వుండే సినీ విశ్లేషకుడు, సెన్సార్ బోర్డు మెంబెర్ అయిన ఉమైర్ సంధు స్పైడర్ మీద ఫస్ట్ రివ్యూ ఇచ్చేసారు.

దసరాకి వస్తున్న స్పైడర్ మూవీతో మహేష్ అభిమానులు నిజమైన పండగ చేసుకుంటారని సంధు చెప్పాడు. ఈ సినిమా కథ, కధనాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయని వివరించాడు. సమాజానికి హాని చేయడమే ధ్యేయంగా విలన్, ఆ సమాజాన్ని కాపాడ్డం తో పాటు ఆ విలన్ ఆటకట్టించేందుకు హీరో వేసే ఎత్తులు పై ఎత్తులు ఆసక్తి రేకెత్తిస్తాయని సంధు అంటున్నాడు. హీరో, విలన్ మధ్య సాగే మైండ్ గేమ్ ప్రేక్షకుల్ని థ్రిల్ కి గురి చేస్తుందట. హీరోగా మహేష్, విలన్ గా సూర్య బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని చెప్పాడు సంధు. రకుల్ ప్రీత్, ప్రియదర్శి యాక్టింగ్ కూడా సినిమాకి ప్లస్ అయ్యింది అంటున్నారు. సినిమా అంతా ఒక ఎత్తు అయితే క్లయిమాక్స్ ఒక్కటి ఇంకో ఎత్తు అంటున్నారు సంధు. నటీనటులకు మించి టెక్నికల్ డిపార్ట్మెంట్ ఈ సినిమా కోసం పని చేసిందట. దర్శకుడు మురుగదాస్ ప్రతిభని కొనియాడిన ఉమైర్ సంధు స్పైడర్ కి 3 .5 రేటింగ్ ఇచ్చారు.