ఇంత కుళ్లు అవసరమా జగన్?

ys-jagan-countering-politically-chandrababu-speech-on-mussoorie-ias-academy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యువ ఐఏఎస్ లని ఉద్దేశించి ముస్సోరీ లో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. మాములుగా అయితే మీడియాలో ఆయన ఆ వేదిక మీద ఏమి మాట్లాడారు అన్నది బయటికి వస్తుంది. అదే జరిగితే బాబు ముస్సోరీలో ఐఏఎస్ లని ఉద్దేశించి మాట్లాడిన విషయం జనం ముందుకు వస్తుంది. ఆ విషయమే వైసీపీ అధినేత జగన్ ని ఇబ్బంది పెట్టింది. అందుకే దీన్ని కూడా రాజకీయం చేయాలనుకున్నారు. చంద్రబాబు ముస్సోరీలో మాట్లాడుతున్న సమయంలోనే వైసీపీ ఎంపీ వరప్రసాద్ పేరిట ఓ ప్రకటన మీడియాకి చేరింది. అందులో ప్రతి బహిరంగ సభలో చంద్రబాబు మీద జగన్ అండ్ కో చేసే విమర్శలే ఓ వరసలో పేర్చారు. దీని వల్ల చంద్రబాబు ప్రతిష్ట దెబ్బ తింటుందని వైసీపీ భావించి ఉండొచ్చు. కానీ కాస్త ఆలోచిస్తే వైసీపీ కుళ్ళు, ఉడుకు మోత్తనం బయటపడింది తప్ప ఇంకేమీ జరగలేదు.

ముస్సోరీ లో ఏ అర్హతతో బాబు మాట్లాడుతారని వైసీపీ ప్రశ్నిస్తోంది. నిజంగా వారు అనుకున్నది నిజం అయితే ఈ ప్రశ్న ఎవరిని వేయాలి ?. చంద్రబాబుని ముస్సోరీకి పిలిచిన వారిని ప్రశ్నించాలి. అంతే కదా. కానీ ఐఏఎస్ లని తయారు చేస్తున్న సంస్థని ఈ ప్రశ్న అడగాలంటే ఇంకెంత అర్హత ఉండాలి. నిజంగా యువ ఐఏఎస్ లకి సందేశం ఇచ్చేంత స్థాయి చంద్రబాబుకి వుందో,లేదో తెలియదు కానీ తాను చేసిన తప్పుకి ఐఏఎస్ లని జైలుకి పంపి, కోర్టుల చుట్టూ తిప్పుతున్న జగన్ కి ఆ అర్హత ఉంటుందా ?. ఎవరి వైపు అయినా ఓ వేలు చూపే ముందు మిగిలిన నాలుగు వేళ్ళు మన వైపే చూస్తాయన్న పాత సామెతని జగన్ కి ఎవరైనా చెపితే బాగుండు. వైసీపీ నేతలకు జగన్ తో చెప్పే ధైర్యం లేకుంటే నంద్యాల,కాకినాడ ఫలితాలు మళ్ళీ మళ్ళీ ఎదురు అవుతాయి .