Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కి దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘స్పైడర్’ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. భారీ అంచనాల నడుమ, దాదాపు 125 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను సాధిస్తుందని అంతా భావించారు. తెలుగుతో పాటు తమిళం మరియు మలయాళంలో విడుదల చేసి 250 కోట్లపై చిత్ర నిర్మాతలు గురి పెట్టారు. కాని పరిస్థితి తారు మారు అయ్యింది. తెలుగులో ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో యావరేజ్‌గా కలెక్షన్స్‌ను రాబడుతుంది. మలయాళంలో కూడా ఈ సినిమాను ప్రేక్షకులు అంతగా ఆధరించడం లేదు. దాంతో సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లును నెత్తిన గుడ్డ వేసుకునే పరిస్థితి వచ్చింది. కనీసం 75 కోట్ల షేర్ వచ్చే పరిస్థితి లేదు అంటూ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.
మొదట ‘స్పైడర్’ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీలో విడుదల చేయాలనుకున్నారు. హిందీలో మహేష్‌బాబు పాత్రకు అక్షయ్ కుమార్‌తో డబ్బింగ్ చెప్పించాలని కూడా భావించారు. కాని ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత హిందీ డబ్బింగ్ విషయమై ఆలోచిద్దాం అంటూ మహేష్‌బాబు దర్శకుడు మురుగదాస్‌కు సూచించాడు. అందుకు సరే అని చెప్పిన మురుగదాస్ ఆ తర్వాత స్పైడర్‌ను హిందీలో రీమేక్ చేయాలని భావించి డబ్బింగ్‌విషయాన్ని పక్కన పెట్టాడు. డబ్బింగ్ చేసి హిందీలో విడుదల చేసినట్లయితే ఖచ్చితంగా మహేష్‌బాబు పరువు పోయేదని, తర్వాత బాలీవుడ్‌లో మహేష్‌బాబుకు అంతగా క్రేజ్ ఉండక పోయేది అంటూ మహేష్‌బాబు ఫ్యాన్స్ అంటున్నారు.
సినిమా మద్యలో ఉన్న సమయంలోనే మహేష్‌బాబుకు సినిమా ఫలితం అర్థం అయ్యి ఉంటుందని, అందుకే హిందీలో డబ్బింగ్ వద్దన్నాడు అంటూ సినీ వర్గాల వారు చెప్పుకుంటున్నారు. మహేష్‌బాబు ముందు చూపుతో తీసుకున్న నిర్ణయంతో మంచి జరిగిందనే టాక్ వినిపిస్తుంది. మొత్తానికి హిందీలో ‘స్పైడర్’ విడుదల కాకపోవడం మంచికే జరిగిందని, గతంలో పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్‌సింగ్‌తో ఎదురైన అనుభవం మహేష్‌బాబుకు ఎదురయ్యేది అంటూ ఫ్యాన్స్ మరియు సినీ వర్గాల వారు అంటున్నారు.