పోలీస్ అకాడమీకి వెళ్ళిన మహేష్…రీజన్ అదేనా ?

mahesh babu visited telangana state police academy

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా తెలంగాణ పోలీసు అకాడమీకి వెళ్లారు. వామ్మో అక్కడికి ఎందుకు అనుకోకండి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహేష్ బాబు కొత్త సినిమాలో అతడు ఓ కాలేజ్ స్టూడెంట్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాలేజ్ ఎపిసోడ్ ను డెహ్రాడూన్ లో చిత్రీకరించారు. ఇప్పుడిక సినిమాకు కీలకమైన క్రికెట్ మ్యాచ్ సీన్ ఒకటి చిత్రీకరిస్తున్నారట. కథలో భాగంగా క్రికెట్ మ్యాచ్ ఆడాల్సి ఉండటంతోపాటు ఓ ఫైటింగ్ సన్నివేశాన్ని తెరకెక్కించాల్సి ఉండటంతో ఆయా సన్నివేశాల చిత్రీకరణకు తెలంగాణ పోలీసు అకాడమి అనువైన ప్రదేశం అని భావించిన మహేష్ బాబు, వంశీ పైడిపల్లి నేరుగా అకాడమికే వెళ్లి అక్కడి పోలీసు ఉన్నతాధికారుల అనుమతి కోరినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు విజ్ఞప్తికి తెలంగాణ పోలీసు అకాడమి ఉన్నతాధికారుల నుంచి సైతం సానుకూల స్పందన లభించినట్టు సమాచారం. అయితే, ఈ విషయంపై అటు అకాడమి అధికారులు కానీ లేదా ఇటు మూవీ యూనిట్ సభ్యులు కానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఊపిరి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డె జంటగా నటిస్తోంది. దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో ఆడియెన్స్ ముందుకు రానుంది.