ఇంకా నెల ఉండగానే.. ప్రమోషన్‌ స్టార్ట్ చేస్తున్న ‘భరత్‌ అను నేను’

Mahesh Bharath Anu Nenu Team Planning To Start Movie Promotions

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్‌ సూపర్‌ హిట్‌ అయిన ‘శ్రీమంతుడు’ చిత్రానికి దర్శకత్వం వహించిన కొరటాల శివతో మరోసారి చేసిన చిత్రం ‘భరత్‌ అను నేను’. ఈ చిత్రం అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ‘బ్రహ్మోత్సవం’ మరియు ‘స్పైడర్‌’ చిత్రాలు అట్టర్‌ ఫ్లాప్‌ అయిన నేపథ్యంలో ఈ చిత్రంపై ఫ్యాన్స్‌ చాలా ఆశలు పెట్టుకున్నారు. కొరటాల శివ మరోసారి మ్యాజిక్‌ చేసి ఖచ్చితంగా సినిమాను సక్సెస్‌ చేస్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు. భరత్‌ అను నేను చిత్రం వచ్చే నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదలకు మరో నెల రోజుల సమయం ఉంది, ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలు పెట్టారు. 

‘భరత్‌ అను నేను’ చిత్రం షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. మరో వైపు చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా చకచక జరిగిపోతున్నాయి. ప్రస్తుతం మహేష్‌బాబుతో పాటు ముఖ్య తారాగణం అంతా కూడా డబ్బింగ్‌ చెబుతున్నట్లుగా తెలుస్తోంది. వారం పది రోజుల్లోనే సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసి ఫస్ట్‌ కాపీని సిద్దం చేసి సెన్సార్‌ ముందుకు తీసుకు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున పబ్లిసిటీ కార్యక్రమాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈనెల చివర్లో వైజాగ్‌లో భారీ ఎత్తున ఆడియో వేడుకను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి