Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగులో ఒక సామెత ఉంది… ఏనుగు చనిపోయిన వెయ్యి వరహాలు పలుకుతుంది, బతికి ఉన్నప్పుడు వెయ్యి వరహాలు పలుకుతుంది. దాన్ని విలువ ఎప్పుడైనా అంతే అనేది ఆ సామెత ఉద్దేశ్యం. అంటే ఏదైనా ఒక వస్తువు ఏ రూపంలో ఉన్నా కూడా ఒకే ధర పలికినట్లయితే ఆ సామెత వర్తిస్తుంది. తాజాగా విడుదలైన మహేష్‌బాబు సినిమాకు కూడా అది వర్తిస్తుందని చెప్పుకోవచ్చు. మహేష్‌బాబుకు ఓవర్సీస్‌లో ఉన్న క్రేజ్‌తో ఆయన ఎలాంటి సినిమా చేసినా కూడా కలెక్షన్స్ వర్షం కురుస్తూనే ఉంటుంది. తాజాగా ఈయన నటించిన స్పైడర్ చిత్రం మరోసారి ఆ విషయాన్ని నిరూపించింది. ‘బ్రహ్మోత్సవం’ వంటి డిజాస్టర్ చిత్రం కూడా ఓవర్సీస్‌లో గౌరవప్రధమైన కలెక్షన్స్‌ను సాధించింది. తాజాగా స్పైడర్ చిత్రం నెగటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా కేవలం ఒక్క రోజులోనే మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసి మొదటి వారాంతంలో రెండు మిలియన్‌లను వసూళ్లు చేయడం ఖాయం అని తేలిపోయింది.
ఓవర్సీస్‌లో భారీగా మహేష్‌బాబుకు ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఈ స్థాయిలో ప్రతి సినిమా వసూళ్లు సాధిస్తుంది. ‘శ్రీమంతుడు’ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో టాప్ 3లో స్ధానం దక్కించుకుంది. ఈ సినిమా కూడా కాస్త పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంటే ఖచ్చితంగా శ్రీమంతుడు స్థాయిలో వసూళ్లు సాధించేది లేదు. రెండు మిలియన్ డాలర్ల వరకు వసూళ్లు చేస్తుందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ఒక తెలుగు సినిమా ఓవర్సీస్‌లో రెండు మిలియన్‌లు అంటే మామూలు విషయం కాదు. భారీ విజయాన్ని సొంతం చేసుకున్నట్లయితేనే ఓవర్సీస్‌లో మిలియన్ మార్క్‌ను క్రాస్ చేస్తాయి. ఇక ఈ సినిమా రెండు మిలియన్‌లు వసూళ్లు చేయబోతుంది అంటే ఏ స్థాయిలో మహేష్‌బాబు అక్కడ క్రేజ్‌ను కలిగి ఉన్నాడో చెప్పుకోవచ్చు.
మురుగదాస్ దర్శకత్వంలో 110 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం మరియు మలయాళంలో కూడా విడుదలైంది. తెలుగులో నెగటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. కాని తమిళం మరియు మలయాళంలో మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ను రాబట్టలేక పోయాయి. ఓవర్సీస్‌లో కనిపిస్తున్న దూకుడు తెలుగు రాష్ట్రాలు మరియు తమిళనాడు, కేరళలో కనిపించడం లేదు. ఈ చిత్రం మహేష్‌బాబు కెరీర్‌లో బిలో యావరేజ్ చిత్రంగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాల వారు విశ్లేషిస్తున్నారు.