మహేష్ స్టార్ పవర్: “ముఫాసా” కటౌట్స్, బుకింగ్స్ లో హవా!

Mahesh Star Power: "Mufasa" cutouts, bookings in full swing!
Mahesh Star Power: "Mufasa" cutouts, bookings in full swing!

మన తెలుగు మూవీ దగ్గర అపారమైన ఆదరణ ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. మరి మహేష్ బాబు హీరోగా ఇపుడు గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో భారీ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ మూవీ కాకుండా ఫ్యాన్స్ అంతా ఆ మధ్య మహేష్ రీరిలీజ్ లతోనే సరిపెట్టుకున్నారు కానీ ఇపుడు మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ కూడా తెలుగు రాష్ట్రాల్లో మాస్ డ్యూటీ చేస్తుంది అని చెప్పాలి. హాలీవుడ్ అవైటెడ్ మోషన్ కాప్చర్ సినిమా “ముఫాసా” వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

Mahesh Star Power: "Mufasa" cutouts, bookings in full swing!
Mahesh Star Power: “Mufasa” cutouts, bookings in full swing!

మరి ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేస్తుండగా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఐకానిక్ సింహం పాత్ర ముఫాసా కి తన వాయిస్ ఓవర్ తో డబ్బింగ్ అందించారు. మరి కేవలం తన వాయిస్ ఓవర్ మాత్రమే కదా అంటే అదే ఇపుడు ఆ మూవీ కి ప్లస్ అయ్యింది.

ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ కటౌట్స్ ఇపుడు దర్శనం ఇస్తుండగా ఇది మహేష్ స్టార్డంకి మచ్చుతునక అని చెప్పొచ్చు. అలాగే టికెట్ బుకింగ్స్ లో కూడా మన దగ్గర ఇంగ్లీష్ కంటే తెలుగులో సాలిడ్ గా కనిపిస్తున్నాయి. దీనితో ముఫాసా కు మాత్రం మహేష్ స్టార్ పవర్ చాలా ప్లస్ అయ్యిందని చెప్పాలి.