సూపర్ స్టార్ మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పుటి నుంచి దీనికి సంబంధించిన అప్‌డేట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో మహేశ్ సరసన అప్‌కమింగ్ హీరోయిన్, మోడల్, మిస్ ఇండియా మీనాక్షి చౌదరి నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఇచట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ ‘ఖిలాడీ’ చిత్రంలో నటించే చాన్స్ కొట్టెసింది.
ఈ క్రమంలో ఆమె త్రీవిక్రమ్-మహేశ్ కాంబినేషన్‌లో రాబోయే చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా ఆమెను ఎంపిక చేసినట్లు వినికిడి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా మీనాక్షిని ‘సలార్’లో ప్రభాస్‌కు సెకండ్ హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. ప్రస్తుతం మహేశ్, డైరెక్టర్ పరశురాంతో చేస్తున్న సర్కారు వారి పాట షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ చిత్రాన్నిసెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్‌గా పూజ హెగ్డే పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.