బ్లాక్ బస్టర్ హిట్ సాధించకపోవడానికి అవే కారణం

బ్లాక్ బస్టర్ హిట్ సాధించకపోవడానికి అవే కారణం

సూపర్ స్టార్ మహేశ్ బాబు, రష్మికా మందన్న జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. అయితే కొన్ని కొన్ని సీన్స్ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయని సరిలేరు నీకెవ్వరు మరింత బ్లాక్ బస్టర్ హిట్ సాధించకపోవడానికి అవే కారణం అని మహేశ్‌కి ఇప్పుడు అర్ధమయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ట్రైన్ కామెడీ ఎపిసోడ్‌లో బండ్ల గణేశ్ కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదని వాటిని తీసేస్తే బాగుంటుందని కొందరు ఫ్యాన్స్ మహేశ్‌కి సలహా ఇచ్చారని దీని గురుంచి మహేశ్ అనిల్ రావిపూడితో చర్చలు జరుపుతున్నారని టాక్. అయితే ఒక టాప్ హీరో సినిమాకి ప్రేక్షకుల నుంచి డివైడ్ టాక్ వచ్చినప్పుడు సినిమాలో అనవసరపు సీన్స్‌ని తొలగిస్తారు. అయితే ఒకసారి సినిమాపై ఒక అభిప్రాయం ఏర్పడ్డాక అలాంటి వాటిని తొలగించినా పెద్దగా ప్రయోజనం ఉండదనే చెప్పాలి. మరి ఈ విషయంపై సరిలేరు టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.