మైసమ్మ ఆలయాన్ని ఢీకొన్న లారీ.. పూర్తిగా ధ్వంసం

తెలంగాణలో రోజు రోజుకీ కరోనా విస్తరిస్తుంది. అయినా కానీ.. కేంద్రప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో ప్రజలు లాక్ డౌన్ నుంచి వారి వారి వ్యాపారాల్లో, కార్యక్రమాల్లో పడిపోయారు. దీంతో జనాలంతా మళ్లీ రోడ్లెక్కారు. వారి వారి వాహనాలతో చెలరేగిపోతూ మళ్లీ హడావుడి నెలతొంది. తాజాగా ఓ లారీ ఢీకొట్టిన కారణంగా మైసమ్మ ఆలయం పూర్తిగా ధ్వంసమైంది. గత రాత్రి భూపాలపల్లి చెల్పూర్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మైసమ్మ ఆలయాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో ఆలయం పూర్తిగా ధ్వంసమైంది.

కాగా తాజాగా లారీ ప్రమాద వశాత్తు మైసమ్మ ఆలయాన్ని ఢీకొనడంతో పూర్తిగా ఆలయం ధ్వంసమైందని స్థానికులు వెల్లడించారు. దీంతో అక్కడ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తమ కులదైవమైన ఆలయం ధ్వంసం కావడంపై స్థానికులు మండిపడుతున్నారు. కాగా భూపాలపల్లి చెల్పూర్ రహదారిపై పెద్దఎత్తున గుమి గూడిన స్థానికులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.