అఖిల్‌ 3లో దుల్కర్‌ ఏంటీ?

Malyalam Hero Dulquer Salmaan Playing Important Role In Akhil 3rd Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అక్కినేని అఖిల్‌ మూడవ సినిమా ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. అదుగో ఇదుగో అంటూ జనవరి నుండి వాయిదాలు వేస్తూ ఎట్టకేలకు నిన్న అఖిల్‌ మూడవ సినిమాను అధికారికంగా ప్రారంభించారు. నాగార్జున క్లాప్‌ కొట్టి అఖిల్‌, వెంకీ అట్లూరిల కాంబో మూవీని పట్టాలెక్కించాడు. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో దుల్కర్‌ సల్మాన్‌ పాల్గొనడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. తెలుగులో దుల్కర్‌ సల్మాన్‌ ఆమద్య ఓకే బంగారం చిత్రంతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ‘మహానటి’ చిత్రంలో నటిస్తుండటం వల్ల మరింతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవుతున్నాడు. మలయాళంలో స్టార్‌ హీరో అయిన దుల్కర్‌ తెలుగులో బిజీ అవ్వాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

హీరో అయిన దుల్కర్‌ సల్మాన్‌ ఎలాంటి పాత్రలు చేసేందుకైనా సిద్ద పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తమిళం మరియు తెలుగులో ఈయన వరుస చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ప్రస్తుతం ‘మహానటి’ చిత్రంలో జెమిని గణేష్‌ పాత్రను పోషిస్తున్న దుల్కర్‌ తాజాగా అఖిల్‌ మూడవ చిత్రంలో ఒక కీలక పాత్రను పోషించేందుకు సిద్దం అయ్యాడు. మహానటి సక్సెస్‌ అయ్యి, దుల్కర్‌ సల్మాన్‌ పాత్రకు మంచి పేరు వస్తే తప్పకుండా అఖిల్‌ మూడవ సినిమాకు దుల్కర్‌ పాత్ర హైలైట్‌ అవుతుందనే నమ్మకంను అక్కినేని అండ్‌ కో భావిస్తుంది. స్వయంగా నాగార్జున ఆ పాత్రకు దుల్కర్‌ను తీసుకోవాల్సిందిగా దర్శకుడు వెంకీకి సూచించినట్లుగా తెలుస్తోంది. బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ అతి త్వరలోనే ప్రారంభించనున్నారు. వచ్చే దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అఖిల్‌ 3లో దుల్కర్‌ ఏంటీ? - Telugu Bullet