యూసీలను బయటపెట్టిన చంద్రబాబు…

Chandrababu releases UC reports

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మా రాష్టానికి మీరు హామీ ఇచ్చినవి ఇవ్వండి, చట్టంలో ఉన్నవి అమలు చెయ్యండి అంటే, ఢిల్లీ పార్టీ ఎలా ఎదురుదాడి చేస్తుందో చూసాం… అన్నీ ఇచ్చేసామని, కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, చేసిన పనులకు యూసీలు, ఇవ్వలేదు అంటూ, బీజేపీ బుకాయిస్తూ వస్తుంది… చంద్రబాబు అసెంబ్లీ వేదికగా, మేము యూసీలు ఇచ్చాం అంటూ, డేట్ వైజ్ చెప్పినా, బీజేపీ మాత్రం, అవే అసత్యాలు చెప్తూ, ప్రజలను కన్ఫ్యుస్ చేస్తుంది… అయితే వీటన్నటికీ చెక్ పెడుతూ, ఈ రోజు చంద్రబాబు చివరకు ప్రభుత్వ యంత్రాంగంలో భాగమైన, యూసీలు కూడా పారదర్శకంగా ప్రజల ముందు పెట్టారు…

వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ.1050 కోట్లలో 940 కోట్లకు యూసీలు ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు. గుంటూరు, విజయవాడకు ఇచ్చిన నిధుల్లో రూ.350 కోట్లకు యూసీలు ఇచ్చామని, అలాగే రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఇచ్చిన రూ.1000కోట్లకు కూడా యూసీలు ఇచ్చామని చంద్రబాబు చెప్పారు…

అయితే, ఎంత చెప్పినా బీజేపీ అవే అబద్ధాలు చెప్తూ, చంద్రబాబు వైపు తప్పు చూపించటంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆ యూసీలు అన్నీ బయట పెట్టింది… ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు రూ.150కోట్ల చొప్పున ఇచ్చారని… శ్రీకాకుళంలో రూ.135.15కోట్లు, విజయనగరంలో రూ.134.74కోట్లు, విశాఖపట్నంలో రూ.135.46 కోట్లు, చిత్తూరులో రూ.134.90కోట్లు, కడపలో రూ.137.08కోట్లు, అనంతపురంలో రూ.124.59కోట్లు, కర్నూలులో రూ.144.55 కోట్లు ఖర్చు చేసినట్లు, కేంద్రానికి పంపించిన యూసీలు విడుదల చేసారు..

అలాగే, ఈ సంవత్సరం, 350 కోట్లు వెనుకబడిన జిల్లాలకు ఇచ్చి, వెంటనే పియంఓ పర్మిషన్ లేదు అని, డబ్బులు మళ్ళీ వెనక్కు తీసుకున్న వివరాలు కూడా బయట పెట్టారు… అలాగే అమరావతికి, అండర్ గ్రౌండ్ డ్రైనేజికి ఇచ్చిన యూసీలు కూడా ప్రభుత్వం విడుదల చేసింది…

మరి ప్రభుత్వం యూసీలు సమర్పించకపోతే ఇన్నాళ్ళు అసలు నిధులు ఎలా విడుదల చేశారు ? ఇప్పుడు ఈ వివరాలు చుసిన తరువాత, ఎవరు అన్యాయం చేసారో ప్రజలకు తెలుస్తుంది.. నిన్న ఉత్తరం రాసి, చంద్రబాబు ముసుగులో గుద్దులాట ఆడుతున్నారు అంటున్న పవన్ కళ్యాణ్ గారు, ఇవి చూసి, మన ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ మేధావులతో చర్చించండి… ఎవరిది తప్పో చెప్తారు… మీరు ఎలాగు మోడీని ఏమి అనలేరు కాదా, ఆ మేధావులు అయినా స్పందిస్తారు… ఇక జగన్ గురించి, మాట్లాడటం కూడా అనవసరం… ఈ వాస్తవాలు చూసి, ఇక ప్రజలే నిర్ణయించాలి…