నిధులు నీ అబ్బసొత్తా..? అమిత్ షాపై సీఎంల దండయాత్ర

South States Chief Ministers attacks on Amit Shah

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఓ సినిమాలో లక్ష రూపాయలు జేబులో పెట్టుకుని తిరిగే కమెడియన్ సునీల్.. కనబడివారికల్లా ఇస్తానంటాడు. కానీ చివరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా… అంతే.. ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రానికి ఓ లెక్క తీసుకెళ్తారు. అందులో కనీసం రెండు నుంచి ఐదు లక్షల కోట్లు ఉంటాయి. అక్కడ ఉన్నది… బీజేపీ ప్రభుత్వమైతే… వారి బానిసలే కాబట్టి నోరు మూసుకుంటారు. కానీ దక్షిణాదితో పాటు బెంగాల్ లోనూ … ఉన్నది నిఖార్సైన ప్రభుత్వాలు కాబట్టి… అమిత్ షా… పొలిమేర దాటక ముందే కొర్రు కాల్చి వాత పెట్టేస్తూంటారు.

గత ఏడాది మేలో… అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చారు. నల్లగొండ జిల్లాలో రాజకీయ భోజనాలు చేసి… కేంద్రం తెలంగాణకు రూ. లక్షా ఇరవై కోట్లిచ్చిందని… ఘనంగా ప్రకటించారు. అంతే తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చెడుగుడు ఆడేశారు. మీ అబ్బసొమ్ము ఇస్తున్నావా అని నిలదీసేసరికి సౌండ్ లేదు. ఇప్పుడు ఎన్నికల మూడ్ ఉన్న కర్ణాటకలోనూ అదే తరహా ప్రచారం. ఈ మధ్య ఎన్నికల ప్రచారానికి వెళ్లి.. కర్ణాటకకు రెండు లక్షల కోట్లిచ్చామని.. సిద్ధరామయ్య తినేశాడని కూసేశారు. దాంతో సిద్ధరామయ్యకు కాలిపోయింది. అంతే.. ఆయన లెక్కలు తీశారు. కర్ణాటక నుంచి కేంద్రానికి వెళ్తున్న సొమ్ములో కేవలం 30 పైసలే తిరిగి వస్తోందని .. మిగతా సొమ్ము ఎక్కడి పోతుందని ప్రశ్నలు గుప్పించారు. అమిత్ షా కు సమాధానం దొరకలేదు. ఆ తర్వాత ఒడిషా, కేరళల్లోనూ అదే లక్ష కోట్లు లెక్క. తాము ఇస్తున్నామని చెబుతున్నారే కానీ… అది ఆ రాష్ట్రాల సొమ్మే అని మాత్రం చెప్పడం లేదు. చివరికి బెంగాల్ కు వెళ్లి.. అక్కడా అదే ప్రచారం చేయబోతే.. అక్కడి సీఎం మమతాబెనర్జీ… మొహం మీద ఖాండ్రించినంత పని చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో ఈ విషయాలనే ప్రస్తావించారు. రాష్ట్రాల సొమ్ము తిని కేంద్రం.. రాష్ట్రాలకే ఇస్తూ.. వారికేదో తాము సాయం చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తుందని మండిపడ్డారు. అమిత్ షా వ్యవహారశైలి వల్ల.. కేంద్రంపై రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింది. కేంద్రానికి ప్రత్యేకంగా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది. రాష్ట్రాల నుంచే వస్తోంది. కేంద్ర పన్నులు అంటూ ప్రత్యేకంగా రాష్ట్రాల నుంచే వసూలు చేస్తోంది. అందుకే మోదీ, అమిత్ షా ఫేక్ ఫెడరలిజంతో దేశాన్ని బలహీనం చేస్తున్నారని వారు మడిపడుతున్నారు. నిన్న మమతాబెనర్జీ.. ఆ తర్వాత సిద్ధరామయ్య ఈ విషయంలో చంద్రబాబుకు మద్దతుగా… ట్వీట్లు కూడా పెట్టారు.

ప్రతీ చోటాకు వెళ్లి అన్ని లక్షల కోట్లు ఇస్తున్నామని గప్పాలు కొట్టుకోవడం ఎందుకు..?. మీకు ఇష్టం లేకపోతే.. ఇవ్వాల్సిన నిధుల్లో ఒక్క రూపాయి అయినా ఆపి చూడండి.. అని నెటిజన్లు సవాళ్లు విసురుతున్నారు. రాజ్యాంగం… ప్రకారం రాష్ట్రాలకు నిధులు వెళ్తాయి. అందులో షా, మోదీ జేబుల్లోంచి ఇచ్చేదేమీ ఉండదు. కానీ రాష్ట్రాల నుంచి వస్తున్న సొమ్ముల్లో తాము మిగుల్చుకునేదే… బలహీన రాష్ట్రాలకు ఇవ్వాలి. అలా చేయకుండా… దక్షిణాదిని కొట్టి ఉత్తరాదికి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

శిశ్రీ✍