అప్పుడే లెఫ్ట్ తో జనసేనకు విభేదాలు.

CPI and CPM parties away from Janasena Party

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికలకు వామపక్షాలతో కలిసి కూటమి ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆర్భాటంగా ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన వామపక్ష నేతలు కూడా అందుకు తల ఊపారు. చంద్రబాబుని ఇబ్బంది పెడదాం అన్న కోణంలో ఈ ఏర్పాటు జరిగినప్పటికీ జాతీయ స్థాయి రాజకీయాలు చూస్తున్న లెఫ్ట్ కేంద్ర నేతలకు బీజేపీ ని ఢీకొట్టాలంటే చంద్రబాబు లాంటి నేత అవసరం ఎంత వుందో ఇప్పటికే అర్ధం అయ్యింది. ఒక్క లెఫ్ట్ మాత్రమే కాదు బీజేపీ అంటే పడని ప్రతి పార్టీ ఇప్పుడు చంద్రబాబుని చూసి స్ఫూర్తి పొందుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు మీద దూకుడు తగ్గించమని ఇప్పటికే ఏపీ లెఫ్ట్ నేతలకు సూచనలు వచ్చినట్టు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో అస్తిత్వం నిలుపుకోడానికి ఏదో ఓ పార్టీ అండ అవసరం అని భావించిన రాష్ట్ర స్థాయి లెఫ్ట్ నేతలు జనసేనతో కలిసి నడవడానికి ఆసక్తి చూపారు. అయితే పవన్ ప్రతి అడుగు ఈమధ్య కాషాయదళం వెయ్యమన్న చోటే వేస్తున్నట్టు లెఫ్ట్ నాయకులకు కూడా అర్ధం అవుతోంది. పైగా బీజేపీ అంటే లెఫ్ట్ ఏ స్థాయిలో మండిపడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉమ్మడి పోరాటం అంటూ తమని అడ్డం పెట్టుకుని బీజేపీ ఆడమన్నట్టు పవన్ ఆడుతుంటే లెఫ్ట్ చూసి సహించిందంటే ఇక చెప్పాల్సిన పనిలేదు. అందుకే వామపక్ష శ్రేణులు పెద్ద ఎత్తున సిపిఎం నేత మధు, సిపిఐ నాయకుడు రామకృష్ణ మీద పవన్ కి దూరం జరగాలని ఒత్తిడి తెస్తున్నాయి. అప్పటికే కేంద్రం పార్టీ సూచనలు కూడా అంది ఉండడంతో లెఫ్ట్ నాయకులు అప్రమత్తం అయ్యారు. నిన్న పవన్ తో కలిసి మాట్లాడిన వాళ్ళు ఈరోజు జనసేన హాజరు కాకపోయినా చంద్రబాబు పిలుపు ఇచ్చిన అఖిలపక్ష భేటీకి హాజరు అయ్యారు. ఈ విషయం చూస్తే లెఫ్ట్, జనసేన మధ్య విభేదాలు మొదలు అయిపోయినట్టే అర్ధం కావడం లేదూ!