Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఈ మధ్యకాలంలో అనుకోని వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కర్నాటక సీఎంగా జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వేదిక వద్దకు వెళ్లడానికి ఏర్పాటు చేసిన భద్రతా చర్యల వల్ల తనకి ఇబ్బంది తలెత్తడంతో వేదిక మీదనే కెమెరాల ముందే కర్ణాటక డీజీపీ నీలమణి రాజు విషయంలో సీరియస్ అయ్యారు. వేదిక వద్దకు వచ్చేందుకు ఆమె కొంత దూరం నడవాల్సి వచ్చింది. దీంతో ఆమె అసహనం వ్యక్తం చేయడమే కాకుండా డీజీపీపై ఫిర్యాదు చేశారు. ఈ వివాదం జరిగి సరిగ్గా ఎందు రోజులు కూడా గడవలేదు ఆమె మరో వివాదంలో చిక్కుకున్నారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కోల్ కతా పర్యటనలో ఆమె ఏకంగా గవర్నర్ నే పక్కకు తోసేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కోల్ కతాలో బంగ్లాదేశ్ భవన్ ను ప్రారంభించేందుకు హసీనా భారత పర్యటనకు వచ్చారు. పొరుగునే ఉన్న దేశ ప్రధాని వస్తున్న నేపథ్యంలో ఆమెకు స్వాగతం పలికేందుకు ప్రధాని మోడీ కూడా కలకత్తా వచ్చారు అయితే ఆయనకి స్వాగతం పలికేందుకు పశ్చిమ బంగ గవర్నర్ కేశరీనాథ్ త్రిపాఠి – కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ఘన స్వాగతం పలికారు. ఈ స్వాగతం సందర్భంగానే గవర్నర్ పట్ల మమత అనుచితంగా వ్యవహరించారు. కేవలం ఫోటో కోసం ప్రధాని మోడీకి గవర్నర్ త్రిపాఠి అడ్డంగా ఉండటంతో మమత ఒక్క సారిగా .గవర్నర్ ను రెండు చేతులతో పక్కకు లాగేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. . ఓ క్షణం నివ్వెరపోయిన గవర్నర్ మోదీ వైపు చూశారు. మోదీ కూడా ఏం పర్లేదులే, అక్కడే ఉండండి అన్నట్టుగా చేత్తో సైగ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.