యాత్ర మొదటి అడుగు అదిరింది

Mammootty Yatra movie First look

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒక పక్క నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎన్టీఆర్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దర్శకుడు తేజ అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాడు. భారీ అంచనాల నడుమ బాలయ్య ఈ చిత్రాన్ని చేసేందుకు రెడీ అయ్యాడు. మరో వైపు ఏపీ మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాజశేఖర్‌ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఒక చిత్రాన్ని చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముటీ లీడ్‌ రోల్‌లో నటించనున్న ఈ బయోపిక్‌కు ‘యాత్ర’ అంటూ టైటిల్‌ను నిర్ణయించిన విషయం తెల్సిందే. తాజాగా యాత్రకు సంబంధించిన ఫస్ట్‌ుక్‌ను విడుదల చేయడం జరిగింది.

మలయాళంలో సూపర్‌ స్టార్‌ మమ్ముటీ ఈ చిత్రంలో అచ్చు రాజశేఖర్‌ల కనిపించబోతున్నాడని ఈ ఫస్ట్‌లుక్‌ చూస్తుంటేనే అర్థం అవుతుంది. జగన్‌ పాత్రకు ఒక యువ హీరోను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు. మరో వైపు ఈ చిత్రం వచ్చే ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తుందనే టాక్‌ కూడా వస్తోంది. ఏప్రిల్‌ 9న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించి, ఇదే సంవత్సరం చివర్లో సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో నిర్మాత ఉన్నాడు. ఈ చిత్రం వెనుక వైకాపా నాయకులు ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.