ఆఫీసర్‌ హంగామ మొదలవ్వనుంది

Nagarjuna Officer movie Teaser release on April 9

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల వర్మకు గత దశాబ్ద కాలంగా సరైన సక్సెస్‌ దక్కలేదు. అప్పట్లో కమర్షియల్‌ సినిమాలకు పెట్టింది పేరుగా నిలిచిన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఇప్పుడు మంచి సక్సెస్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. కెరీర్‌ ఆరంభంలో నాగార్జునతో పలు చిత్రాలు చేసి సక్సెస్‌ అయిన దర్శకుడు వర్మ ఇన్నాళ్లకు మళ్లీ నాగార్జునతో ‘ఆఫీసర్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ‘శివ’ రేంజ్‌లో ఈ చిత్రం ఉంటుందని, అప్పట్లో శివ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో, ఈ చిత్రం కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఈ చిత్రం షూటింగ్‌ దాదాపుగా పూర్తి అవడానికి వచ్చిందని, వచ్చే నెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇటీవలే వర్మ ప్రకటించాడు. ఇక ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్‌తో సందడి చేసేందుకు వర్మ సిద్దం అవుతున్నాడు. తన గత చిత్రాలకు చేసినట్లుగా చీప్‌ పబ్లిసిటీ కాకుండా కాస్త హుందాగా ఈ చిత్ర పబ్లిసిటీ జరగాలని నాగార్జున వర్మకు సూచించినట్లుగా తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగానే వర్మ మొదట టీజర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశాడు. ఈనెల 9న టీజర్‌ను విడుదల చేయాలని నిర్ణయించాడు. ఇదే నెల చివర్లో సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తాడని సమాచారం అందుతుంది. నాగార్జున చాలా విభిన్నంగా ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు. పవర్‌ ఫుల్‌ ఆఫీసర్‌గా వర్మ కనిపించనున్న ఈ చిత్రం వర్మకు కమర్షియల్‌ సక్సెస్‌ను తెచ్చి పెడుతుందా అనేది చూడాలి.