రంగ‌స్థ‌లంపై ఆగ‌ని ప్ర‌శంస‌ల వాన‌

ram gopal varma about ram charan movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రంగ‌స్థ‌లం విడుద‌లై వారం గ‌డుస్తున్న‌ప్ప‌టికీ…టాలీవుడ్ ప్ర‌ముఖుల ప్ర‌శంస‌ల వ‌ర్షం ఆగ‌డం లేదు. ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీలు సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించ‌గా..తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు, డైరెక్ట‌ర్లు రాజ‌మౌళి, రామ్ గోపాల్ వ‌ర్మ కూడా రంగ‌స్థ‌లాన్ని పొగుడుతూ ట్వీట్లు చేశారు. రంగ‌స్థ‌లం ఓ బుల్లెట్ లాంటి అఛీవ్ మెంట్ అని వ‌ర్మ అభివ‌ర్ణించారు. రామ్ చ‌ర‌ణ్ మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్ అంటూ కితాబిచ్చారు. హేయ్ సుకుమార్…నీకు మూడు ధ‌న్య‌వాదాలు, మూడు ముద్దులు అని ట్వీట్ చేశారు వ‌ర్మ‌. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి కూడా చ‌ర‌ణ్ ను పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు. రంగ‌స్థ‌లంలో చిట్టిబాబు క్యారెక్ట‌ర్ ను సుకుమార్ మ‌లిచిన తీరు, ఆ పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ ఒదిగిపోయిన తీరు సూప‌ర్బ్ అని, చ‌ర‌ణ్ న‌ట‌న‌ను చూడ‌డం ఓ ట్రీట్ వంటిద‌ని కితాబిచ్చారు. చ‌ర‌ణ్ పాత్ర‌లోని ప్ర‌తి ఎక్స్ ప్రెష‌న్ అద్భుత‌మ‌న్నారు. చ‌ర‌ణ్ కు దీటుగా జ‌గ‌ప‌తిబాబు న‌టించార‌ని, స్లోగా ఆయ‌న డైలాగులు చెప్పిన తీరు అద్భుతంగా ఉంద‌ని కొనియాడారు.

రంగ‌స్థ‌లంలో ఎన్నో మంచి విష‌యాలు ఉన్నాయ‌ని, టెర్రిఫిక్ బాక్సాఫీస్ ఫ‌ర్మామెన్స్ ప్ర‌ద‌ర్శించినందుకు మైత్రీమూవీస్, సుకుమార్, ఇత‌ర టీమ్ స‌భ్యుల‌కు శుభాకాంక్ష‌లని ట్వీట్ చేశారు. టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబుకి కూడా రంగ‌స్థ‌లం చాలా న‌చ్చింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ట్విట్ట‌ర్ లో తెలియ‌జేశారు. రంగ‌స్థ‌లంతో మైత్రీ మూవీ మేక‌ర్స్ మ‌రోసారి త‌న స‌త్తా చాటింద‌ని ట్వీట్ట‌ర్ లో ప్ర‌శంసించారు. రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత‌ల‌కు….క‌చ్చితంగా ఇది వారి సినీ కెరీర్ లోనే అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చిన చిత్రమ‌ని కొనియాడారు. మొత్తం చిత్ర‌బృందానికి శుభాకాంక్ష‌ల‌ని, సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేశాన‌ని తెలిపారు. ద‌ర్శ‌కుడు సుకుమార్ ను ట్రూలీ ఏ మాస్ట‌ర్ ఆఫ్ ది ఆర్ట్ అని ప్ర‌శంసించారు. సుకుమార్, దేవిశ్రీ ప్ర‌సాద్ కాంబినేష‌న్ లో తాను చేసిన నేనొక్క‌డినే సినిమాలో..ఓ సాంగ్ లోని రాక్ స్టార్ ప‌దాన్ని ఉద‌హ‌రిస్తూ …ప్ర‌తి విష‌యంలోనూ నువ్వు ఒక రాక్ స్టార్ అంటూ దేవిశ్రీ పై పొగ‌డ్త‌ల జ‌ల్లు కురిపించారు. ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ అద్భుతంగా ఉంద‌న్నారు. మ‌హేశ్ ప్ర‌శంస‌ల‌పై స‌మంత స్పందించారు. మీ నుంచి ప్ర‌శంస పొంద‌డం చాలా సంతోషంగా ఉంద‌ని ధ‌న్య‌వాదాలు చెప్పారు. మొత్తానికి రికార్డు క‌లెక్ష‌న్లు సాధిస్తున్న రంగ‌స్థ‌లం అదే స్థాయిలో ప్ర‌శంస‌లు కూడా అందుకుంటోంది.

ram gopal varma about CHARAN