నగరంలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఓ ఇంజనీరింగ్ విద్యార్థిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం తనను తాను కత్తితో పొడుచుకున్నాడు. ప్రస్తుతం అతని విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెజవాడలో ఇంజనీరింగ్ చదువుతున్న ఓ యువతిని స్థానికంగా ఉంటున్న స్వామి అనే యువకుడు కొంతకాలం ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.
తన ప్రేమను నిరాకరించిందని కక్ష కట్టిన స్వామి.. గురువారం యువతి ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన యువతిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా, దాడి అనంతరం స్వామి తనను తాను కత్తితో గాయపర్చుకున్నాడు. ప్రస్తుతం స్వామి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.