గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం ఘటన మరువకముందే మరో ఘటన విశాఖలో చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖ ఫెర్రీ వీధికి చెందిన వాలంటీర్ ప్రియాంకపై శ్రీకాంత్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. అనంతరం ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తీవ్రగాయాలపాలైన యువతిని కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రియాంకపై శ్రీకాంత్ దాడి చేయటానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. ప్రియాంక, శ్రీకాంత్‌లు గతకొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు కొన్ని ఫేస్‌బుక్‌లో దర్శనమిచ్చాయి. ప్రస్తుతం ఈఎన్‌టీ వైద్యుల పర్యవేక్షణలో ప్రియాంకకు చికిత్స అందుతోంది. ఆమె గొంతు దగ్గర కోయటంతో తీవ్ర రక్తస్రావం అయింది.