ప్రేమ పెళ్లి…కలతలు…తల నరికి కాలువలో పడేసి….

-man-behead-wife-severed-head-satyanarayanapuram

చిన్న కారణాలతోనే చేజేతులా కాపురాలను నాశనం చేసుకొని కట్టుకున్న వాళ్లను కిరాతకంగా కడతేరుస్తున్న ఘటనలు నేటి సమాజంలో నానాటికీ పెరుగుతున్నాయి. ఇలాంటి వాటితో ఇరు కుటుంబాలకు చెందిన వారు ఇబ్బందుల్లో పడుతుండగా వారి పిల్లలు అనాథలవుతున్నారు.

క్షణికావేశంలో కొంత మంది తమ పిల్లలను చిన్నారులు అనే కనికరం లేకుండా దారుణంగా చంపుకుంటున్నారు. తాజాగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తల నరికి దారుణంగా చంపేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగిచింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన విజయవాడలో కలకలం రేకెత్తించింది.

సీసీ కెమెరా దృశ్యాలను చూసిన భయభ్రాంతులకు గరయ్యారు. విజయవాడకు చెందిన ప్రదీప్ మనిక్రాంతి అనే యువతిని ప్రాణంగా ప్రేమించాడు. వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో పెద్దలు వారి పెళ్లికి నిరాకరించారు. పెద్దలను ఎదిరించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

కానీ ఆ కాపురంలో కొంత కాలం కిందట కలతలు చోటుచేసుకున్నాయి. ఆమె అతడిపై వేధింపుల కేసు పెట్టింది. అతడు విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. ఈలోగా వేధింపుల కేసులో అరెస్టై జైలుకు వెళ్లొచ్చాడు. ఈ క్రమంలో ఆమెపై కసి పెంచుకున్న ఆ వ్యక్తి.. కట్టుకున్న భార్యను కత్తితో అతి కిరాతకంగా నరికి చంపాడు.

అనంతరం ఆమె తలను చేత్తో పట్టుకొని నడిచి వస్తూ నడిరోడ్డుపై వీరంగం చేశాడు. హత్యోదంతాన్ని చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో కొంత మంది రోడ్డుపై పరుగులు తీశారు. మహిళను కత్తితో నరికి చంపి ఆమె తలను చేత్తో పట్టుకొని వెళ్తున్న వ్యక్తి దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.