ఎమ్మెల్యే రోజా ఇంటికి కేసీఆర్.. ఎందుకంటే ?

KCR-Visits-Roja-House

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లనున్నారు. కుటుంబసమేతంగా సీఎం కేసీఆర్‌ ఇవాళ తమిళనాడులోని కాంచీపురానికి వెళ్లనున్నారు. అక్కడ వరదరాజ స్వామిని దర్శించుకోనున్నారు.

మార్గంమధ్యలో నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి కేసీఆర్ వెళ్లి అక్కడే టిఫిన్, మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం చేసి బయలుదేరతారు. ఉదయం 9 గంటలకు టిఫిన్, మధ్యాహ్న భోజనం అక్కడే చేయనున్నారు. ఇందుకోసం రోజా ఇంట్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

గతంలో కేసీఆర్ కుటుంబసభ్యులు తిరుమల వచ్చిన సందర్భంగా వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర‌రెడ్డి ఇంటికి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మ్రొక్కులు తీర్చుకుంటానని కేసీఆర్ మొక్కుకున్నారు. ఆయన కోరిక ఫలించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, ఆయన వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి కావడం జరిగిపోయింది. ఈ క్రమంలో ఒక్కో దేవాలయంలో ఆయన మ్రొక్కులు చెల్లించుకుంటూ వస్తున్నారు.