తన ప్రేమ విషయం తెలుసుకుందని కూతుర్ని చంపి కళ్ళు పీకేసిన తండ్రి !

Man Brutally kills His Lover

మేడ్చల్‌లోని ఓ బస్తీలో గోనెసంచిలో బాలిక మృతదేహం లభించడం కలకలం రేపింది. పట్టణంలోని ఓ బస్తీలో ఈరోజు ఉదయం గోనెసంచిని గుర్తించిన స్థానికులు దాన్ని తెరిచారు. అందులో 16-18ఏళ్ల వయసు గల బాలిక మృతదేహం ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మేడ్చల్ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని గోనెసంచిని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి వయస్సు 18ఏళ్ల కంటే తక్కువగా ఉంటుందని, మొహం గుర్తుపట్టకుండా యాసిడ్ పోసినట్లు పోలీసులు తెలిపారు. బాలికను ఎక్కడో హత్యచేసి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారా? లేక ఆమె స్థానికురాలేనా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. దీంతో బాలిక మర్డర్ మిస్టరీ వీడింది. బాలికను తండ్రే అతి కిరాతకంగా చంపి మూటకట్టి పడేసినట్లు తేలింది. ప్రియురాలి మోజులో పడి కన్నబిడ్డను హతమార్చినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఈ కేసుకు సంబంధించిన నిందితుడు చెప్పిన నిజాలు తెలుసుకొని పోలీసులే కంగుతిన్నారు. బాలిక తండ్రికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందట. ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రిని ప్రశించిందట. దీంతో ఆమెపై తండ్రి కక్ష పెంచుకుని ఆ కోపంతోనే బాలికను హత్య చేసేందుకు ప్లాన్ వేశాడట. కిరాతకంగా కూతురి గొంతు కోసి.. ఆనవాళ్లు తెలియకుండా మొహంపై చర్మాన్ని చెక్కి రెండు కళ్లను పీకేశాడు. తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లి కింది బస్తీలో పడేశాడు. గోనె సంచిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు. డాగ్‌స్వ్కాడ్‌‌ను రంగంలోకి దించినా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దగ్గరలో సీసీ కెమెరాలు లేకపోవడంతో పాటూ వర్షం కురుస్తుండటంతో పోలీసులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరికి తండ్రిపై అనుమానంతో ప్రశ్నించడంతో మిస్టరీ వీడింది.