వంద రూపాయల కోసం గొడవ…తమ్ముడిని చంపిన అన్న 

murder

ఎపీలోని అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో దారుణం జరిగింది. రూ.100కోసం జరిగిన గొడవలో అన్న చేతిలో తమ్ముడు దారుణహత్యకు గురయ్యాడు. ధర్మవరం పట్టణంలోని వైఎస్సార్‌ కాలనీలో రామచంద్ర, మారెప్ప అనే అన్నదమ్ములు తమ కుటుంబాలతో కలిసి నివసిస్తున్నారు. భవన నిర్మాణ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మద్యానికి బానిసైన మారెప్ప డబ్బుల కోసం అన్నను వేధిస్తున్నాడు. శనివారం రాత్రి మద్యం తాగేందుకు రూ.100 కావాలని అన్నను అడగగా అతడు లేవని చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన మారెప్ప కర్రతో అన్న రామచంద్రపై దాడి చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన రామచంద్ర కత్తితో తమ్ముడిని పొడిచేశాడు. దీంతో కుటుంబసభ్యులు మారెప్పను ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. మారెప్ప భార్య నాగరత్నమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ధర్మవరం పోలీసులు నిందితుడు రామచంద్రను ఆదివారం అరెస్ట్ చేశారు.