15ఏళ్ల కొడుక్కి ఫోన్ ఇస్తే…తన అఫైర్స్ అన్నీ పట్టించాడు !

phone sim card

15ఏళ్ల కొడుకు గేమ్ ఆడుకుంటానంటే ఫోనిచ్చిన తండ్రికి ఊహించని షాక్ ఇచ్చాడు ఆ కొడుకు. వివరాల్లోకి వెళితే బెంగళూరులోని బనశంకరీ స్టేజ్‌-3 ప్రాంతంలో ఓ వ్యక్తి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతడు ఓ సామాజిక సంస్థను నిర్వహిస్తుండగా భార్య ఓ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. ఆయన కొడుకు గేమ్ ఆడుకుంటానంటే అతడు తన మొబైల్ ఫోన్ ఇచ్చాడు. గేమ్ ఆడుతుండగా పిల్లాడు అనుకోకుండా ఆడియో రికార్డింగ్ పోల్డర్‌‌లోకి వెళ్లాడు. పైల్స్ ఓపెన్ చేయగా అసభ్యకర సంభాషణలు ఉన్నాయి. అందులోని మగగొంతు తన తండ్రిదేనని నిర్ధారించుకున్న ఆ కుర్రాడు ఈ విషయాన్ని తల్లికి చెప్పాడు. తన భర్త ఇతర మహిళలతో అసభ్యంగా మాట్లాడుతున్న సంభాషణ విని షాకైంది. వాట్సాప్‌‌లో కూడా చాలామంది మహిళలతో అసభ్యంగా తీసుకున్న ఫోటోలు ఉండటంతో వెంటనే పోలీస్‌స్టేషన్ వెళ్లి భర్త నిర్వాకంపై ఫిర్యాదు చేసింది. తన భర్త ఇతర మహిళలతో వివాహాతర సంబంధాలు పెట్టుకుని తనను వేధింపులకు గురిచేస్తున్నాడని, నిలదీస్తే బెదిరిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తనకిష్టం వచ్చినట్లు ఉంటానని, నచ్చిన వారితో తిరుతానని ఏం చేసుకుంటావో చేసుకో అని తన భర్త బెదిరిస్తున్నట్లు ఆమె చెబుతోంది.