ప్రేమించిన యువతి వరుసకు చెల్లి అవుతుందని తెలియడంతో యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్‌పోడు తండాలో ఆదివారం చోటుచేసుకుంది. తండాకు చెందిన బానోతు వంశీ మహబూబాబాద్‌లో ఇంటర్ చదువుతూ బస్సులో రాకపోకలు సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గంధంపల్లి–కొత్తపేటకు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది.
పరిచయం ప్రేమగా మారగా, వరుసకు చెల్లి అవుతానని ఆ యువతి ప్రేమను నిరాకరించింది. దీంతో మనస్తాపం చెందిన వంశీ ఐదు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చెందాడు. మృతుడి తండ్రి భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగదీశ్ తెలిపారు.