యువతి ఇంటి నుంచి బయటకు రమ్మంటే రాలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బాలానగర్‌లోని శోభన కాలనీలో జరిగింది. వివరాలు.. జగద్గిరిగుట్ట నెహ్రూనగర్‌కు చెందిన శుభమ్ (26)కు బాలానగర్ శోభన కాలనీకి చెందిన యువతితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో నిన్నరాత్రి శుభమ్ యువతి ఇంటికి వెళ్లి ఇంటి నుంచి బయటకు రావాలని ఆమెను కోరాడు.
అయితే ఆమె రాకపోవడంతో నానాయాగీ చేసి యువతి, ఆమె తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా యువతి తల్లిదండ్రులే శుభమ్‌ను కొట్టి చంపారని మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ పోలీసులు తెలిపారు.