పాము కాటుతో యువకుడి మృతి

పాము కాటుతో యువకుడి మృతి

మండలంలోని కామిశెట్టిపల్లి గ్రామానికి చెందిన రాజు(35) ఆదివారం పాము కాటుతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజు మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తాడు.

తన సోదరితో రాఖీ కట్టిన తర్వాత రాజు తన బార్బర్‌ షాపులో పని చేసుకుంటుండగా పాము కరవడం గమనించకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. పాము కరిచిన చాలా సేపటి తర్వాత స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. కేసు నమోదు చేసుకొని దర్యాపు చేస్తున్నట్లు ఎస్సై మచ్చేందర్‌ పేర్కొన్నారు.