హోసూరులో టిక్ టాక్ వీడియో చేయడానికి ప్రాణంతో ఉన్న చేపలు మింగిన యువకుడు ఊపిరాడక మృతి చెందిన సంఘటన సంచలనం కలిగించింది. కృష్ణగిరి జిల్లా హోసూరు ఖాలేగుంట పార్వతినగర్‌కు చెందిన వెట్రివేల్ (22) కట్టడం మేస్త్రీ. అతనికి వివాహమై భార్య, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. గురువారం తన స్నేహితులతో కలిసి హోసూరు తెర్‌పేటలో ఉన్న చెరువు గట్టుకు చేపలు పట్టడానికి వెళ్లాడు. చదవండి: పురుగుల మందు తాగి టిక్‌టాక్
అక్కడ మద్యం తాగిన మత్తులో చేపలు పడుతున్నారు. ఆ సమయంలో టిక్‌టాక్ వీడియో చేయడానికి ఓ చేపను మింగాడు. ఆ చాప అతని శ్వాసనాళంలో తగులుకోవడంతో ఊపిరాడక అతను స్పృహతప్పి పోయాడు. ఇది చూసిన స్నేహితులు అతన్ని హోసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. హోసూరు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.