దీపావళి రోజు విషాదం చోటుచేసుకుంది. రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవ కారణంగా ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. షామ్లీ జిల్లాలో గురువారం దీపావళి రోజు టపాసులు కాల్చడంపై రెండు గ్రూపుల మధ్య ఘర్షణ ఏర్పడింది. గొడవ మరింత ముదిరి ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని రాహుల్, సంజీవ్ సైనీగా పోలీసులు గుర్తించారు. ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొదుతూ ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపినట్లు తెలిపారు.