భార్యతో గొడవపడి మాయం

భార్యతో గొడవపడి మాయం

తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి భార్యతో గొడవపడి కనిపించకుండా పోయిన ఘటన జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్‌కు చెందిన ప్రభాకర్‌చారి, స్వాతిలు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. ప్రైవేట్‌ ఉద్యోగం చేసే ప్రభాకర్‌చారికి తాగుడు అలవాటు ఉంది.

కాగా స్వాతి లాలాపేట్‌లో ఉండే తన తల్లి అనారోగ్యంగా ఉండటంతో పిల్లలను తీసుకుని ఇటీవల తన భార్య పుట్టింటికి వెళ్లింది. తిరిగి ఈ నెల 14న ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లోని సామగ్రి కనిపించలేదు. ఈ విషయమై భర్తను ఆరా తీయగా తానే అమ్మేశానని చెప్పడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రభాకర్‌ చారి తన మొబైల్‌ను ఇంట్లో ఉంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు.

అతడి ఆచూకీ కోసం స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వాకబు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అతడి భార్య స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.