అక్రమ సంబంధాలు కారణంగా ఎన్ని కుటుంబాలు నాశన మవుతున్నాయో మనం చూస్తునే ఉన్నాం. కానీ వివాహేతర సంబంధాలు కారణంగా వారి సంతానం తప్పుదోవలో ప్రయాణించి జీవితాలను బలి చేసుకున్న ఉదంతాలు కోకొల్లలు. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. అచ్చం అలానే ఒక వితంతువు వివాహేతర సంబంధం కారణంగా అసువులు బాసింది.
అసలు విషయంలోకెళ్లితే…లందాపురా గ్రామ సమీపంలో హంస పర్మార్ అనే వితంతువు శైలేష్ వాఘేలా అనే వివాహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఆమె తనను పెళ్లి చేసుకోమని వాఘేలాని ఒత్తిడి చేస్తుంది. ఈ మేరకు వాఘేలాకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉండటంతో అందుకు అంగీకరించ లేదు. ఈ క్రమంలో ఆమె వాఘెలా పై మరింతగా తనను పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి తీసుకువచ్చింది.
దీంతో వాఘేలా కాలువ వద్ద కలుద్దాం అని పర్మార్ని పిలిచి గొంతు కోసి చంపి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ మేరకు స్థానికులు సావ్లి తాలూకాలోని కాలువ సమీపంలో ఒక మహిళ హత్యకు గురైందని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి కేసు నమోదు చేసి విచారించడమే కాక నిందుతుడు మంజుసర్ నివాసి శైలేష్ వాఘేలాగా గుర్తించి అరెస్టు చేశారు.