ఇంటర్నెట్ సేవలు రద్దు… ఒకరు హత్య

అసలే లాక్ డౌన్. ఇదే సమయంలో ఇంట్లో అంతా రకరకాల వ్యాపకాల్లో ఉంటారు. ఇదే సమయంలో ఎవరైనా ఏదైనా ఆటంక పరిస్తే.. చిర్రెత్తిపోతది. గుజరాత్ లో ఇలాంటిదే ఓ ఘోరం జరిగింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తాజాగా తన సేవలను రద్దు చేశాడన్న కోపంతో ఓ వ్యక్తిని ముగ్గురు ఉద్యోగులు హత్య చేశారు.
కగా  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు అసర్వ నివాసి 35 ఏళ్ల సత్నామ్సింగ్ సలుజాగా గుర్తించారు. హత్యకు కారణమైన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అసలు విషయంలోకి వెళ్తే…. బాధితుడు మేఘనినగర్‌లో మొబైల్ ఫోన్ షాపును నడుపుతున్నాడు. అయితే ఈ ఏడాది జనవరిలో ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత రెండు నెలలకు ఇంటర్నెట్ రద్ద అయింది. కాగా బాధితుడు కనెక్షన్‌ను తిరిగి ఇన్‌స్టాల్ చేయమని స్థానిక సేవా అధికారి విశాల్ పట్నిని సంప్రదించాడు.
కానీ.. ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దాంతో అతని ముగ్గురు సహచరులు సాలూజా ఇంటికి వెళ్లి ఈ విషయం గురించి అడిగారు. బాధితుడు ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా లేదని ఫిర్యాదు చేసినప్పుడు.. ముగ్గురు నిందితులకు బాధితుడికి వాగ్విదం జరగడంతో ఆవేశంతో ఇలాంటి ఘటన చేటు చేసుకుందని అధికారులు స్పష్టం చేశారు.