తండ్రిపై కక్ష పెంచుకుని చంపేశాడు

తండ్రిపై కక్ష పెంచుకుని చంపేశాడు

మానవ సంబంధాలు ఏమైపోతున్నాయో అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తుంటే. ఆస్తి కోసం లేక తనకు ఇష్టం లేని పని చేశారనో చంపడం వరకు వెళ్లి వాళ్ల జీవితాలను కటకటాలపాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం అలాంటి ఘటనే మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళ్లితే…..మహారాష్ట్రలోని థానేలోని ముర్బాద్ తాలూకాలోని దొంగర్ నవ్లే గ్రామంలో 35 ఏళ్ల వ్యక్తి తన తండ్రితో గత ఐదేళ్లుగా ఆస్తి కోసం గొడవ పడుతూ ఉన్నాడు. పైగా తన తండ్రి రెండో పెళ్లి చేసుకోవడం కూడా అతనికి నచ్చలేదు. ఈ క్రమంలో అతను తన తండ్రిపై కక్ష పెంచుకుని ఒక రోజు రాత్రి తన తండ్రి నిద్రపోతున్నసయంలో వెళ్లి మళ్లీ ఆస్తి కోసం గొడవ చేసి అతి కిరాతంగా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత అతను అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో థానే పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు.