ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆరు నెలలపాటు ప్రేమలో మునిగితేలారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. తీరా కట్‌చేస్తే ప్రేమించిన లవర్‌కు మాయమాటలు చెప్పి ప్రియుడే అంతమొందించాడు. పెళ్లి పీటల ఎక్కాల్సిన యువతికి కెటామైన్ ఇంజక్షన్(డ్రగ్) ఇచ్చి కాటికి పంపాడు. మరి జీవితం పంచుకోవాలనుకున్న యువతిని చంపడానికి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.. మహారాష్ట్రలోని నవీ ముంబైకు చెందిన ఓ వ్యక్తి కొంతకాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ కలిసి సంతోషంగా కాలం గడుపుతున్న సమయంలో యువతికి ప్రాణాంతక వ్యాధి ఉందని తెలిసింది. ఇది జీర్ణించుకోలేకపోయిన యువకుడు.. ప్రియురాలికి దూరం అవ్వాలని నిర్ణయించుకున్నాడు.
ఈక్రమంలో కొన్ని రోజుల నుంచి ఆమెతో నిత్యం గొడవ పెట్టుకుంటున్నాడు. ఓ రోజు తెగించి ఆమెకు మత్తుమందువంటి ఇంజక్షన్ ఇచ్చి హతమార్చాడు. అనంతరం తనకేం తెలియదన్నట్లు ఊరుకున్నాడు. అయితే మే 29న పన్వెల్ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె వద్ద ఎలాంటి ఐడీ పత్రాలు లేనందున పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా రమేశ్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చి మృతదేహాన్ని తన సోదరిగా గుర్తించాడు. అయితే తన చెల్లికి పన్వెల్‌లోని ఆసుపత్రిలో పనిచేస్తున్న చంద్రకాంత్ గైకర్ అనే వ్యక్తితో ఎఫైర్ ఉందని పోలీసులకు సమాచారమిచ్చాడు.
వెంటనే నిందితుడిని పట్టుకునేందుకు ఓ బృందాన్ని పోలీసులు పంపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని వాళ్ల స్టైల్‌లో పోలీసులు విచారించడంతో గైకర్ తన నేరాన్ని అంగీకరించాడు. ఆరు నెలలు మహిళతో ప్రేమలో ఉన్నట్లు, కానీ ఆమెకు ఇటీవల జబ్బు ఉందని తెలిసి వెంటనే పెళ్లి చేసుకుందామని బెదిదిస్తోందని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో విసిగిపోయిన తను ఆమెను చంపాలని నిర్ణయంచుకున్నట్లు తెలిపాడు. ఆ ఇంజక్షన్ అనారోగ్యాన్ని నయం చేస్తోందని అబద్ధం చెప్పి యువతికి కెటమైన్ ఇంజక్షన్ ఇచ్చి చంపేసినట్లు పోలీసుల ఎదుట నేరం అంగీకరించాడు. నేరానికి సంబంధించిన సాక్షాలను నాశనం చేసేందుకు ఆమె మొబైల్‌లో ఫోన్, అన్ని వస్తువులు పెట్టి బయట పడేసినట్లు తెలిపాడు.