కేరళలో దారుణం చోటు చేసుకుంది. సోషల్ మీడియా పోస్ట్ వల్ల చేలరేగిన వివాదం చివరకు మహిళ ప్రాణాన్ని బలి తీసుకుంది. తిరువనంతపురం మెడికల్ కాలేజీ వద్ద మహిళను సజీవ దహనం చేశాడు ఆమె భాగస్వామి. ఆ వివరాలు.. షానవాజ్(30), అతిరా గత కొద్ది కాలంగా సహజీవనం చేస్తున్నారు. కొల్లాం అంచల్లో నివసిస్తున్నారు. వీరికి మూడు నెలల పాప ఉంది.
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అతిరా సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. దీనిపై ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. మాట మాట పెరిగింది. ఆగ్రహించిన షాన్వాజ్ అతిరా మీద కిరోసిన్ పోసి, లైటర్‌తో నిప్పంటించాడు. ఆమె ఆరుపులు విన్న ఇరుగుపొరుగు వారు అంబులెన్స్‌కు కాల్ చేశారు. ఇక ఈ ఘటనలో షాన్వాజ్కు కూడా తీవ్రంగా గాయలయ్యాయి.
ఇద్దరిని ఆస్పత్రిలో చేర్చారు. ఇక తీవ్రంగా గాయపడిన అతిరా మృతి చెందగా.. షాన్వాజ్ చికిత్స పొందుతున్నాడు. ఇక అతిరా తల్లి ఫిర్యాదు మేరకు కొల్లాం పోలీసులు షాన్వాజ్ మీద కేసు నమోదు చేశారు.