తెలంగాణలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించడం లేదన్న కోపంతో ఓ వ్యక్తి యువతి గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. 8ఎంక్లేన్ కేకే నగర్‌కు చెందిన రాజు అనే యువకుడు స్థానికంగా ఓ యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే తనకిష్టం లేదంటూ ఆమె అతడిని దూరం పెడుతూ వస్తోంది. దీంతో యువతిపై కక్ష పెంచుకున్న రాజు ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
మంగళవారం సాయంత్రం కత్తితో యువతి గొంతు కోసి పరారయ్యాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న యువతిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు యువతిని గొంతు కోసిన తర్వాత రాజు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తమ బిడ్డను ప్రేమ పేరుతో వేధించి ప్రాణం తీసిన కిరాతకుడిని కఠినంగా శిక్షించాలని యువతి కుటుంబసభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.