సంతోషంగా వందేళ్లు జీవించాల్సిన దంపతులు వివాహేతర సంబంధం కారణంగా మధ్యలోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన భార్య మోజులో పడి కట్టుకున్న భార్యనే అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. బీహార్‌లోని పాట్నాకు సన్నీ పాశ్వాన్, వర్ష కుమారి దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
నాలుగేళ్ల క్రితం వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం తరువాత వర్ష తన పుట్టింట్లోనే ఉంటోంది. ఆమె భర్త కూడా అక్కడే ఉంటున్నాడు. కొంత కాలంగా సన్నీ తన భార్య చెల్లెలితో ప్రేమాయణం మొదలుపెట్టాడు. ఇటీవల ఈ వ్యవహారం వర్షకి తెలియడంతో అతని భర్తతో వద్దని వారించింది. అది కాస్త వారి మధ్య ఘర్షణలకు దారి తీసింది. చివరికి ప్రేయసి కోసం కట్టుకున్న భార్యనే చంపాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం పక్కాగా ప్లాన్ వేసి తన భార్య కిరాతకంగా గొంతు కోసి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని కనిపించకుండా చేసేందుకు ప్రయత్నించాడు.
వర్ష మృతదేహాన్ని పెట్టెలో కుక్కి పడేసే ప్రయత్నం చేశారు. అయితే, అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపు.. సన్నీ, అతని ప్రియురాలు అక్కడి నుంచి పరారయ్యారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.