భార్యను వేటకొడవలితో నరికి చంపిన భర్త…!

Man Kills His Wife And Her Lover In Their Private Space

రోజురోజుకీ వివాహేతర సంబంధం వల్ల జరిగే హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువయిపోతున్నాయి. రెండ్రోజుల క్రితం తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని చేతికి అందివచ్చిన కొడుకుని నిద్రమాత్రలు ఇచ్చి, గొంతు నులిమి చంపిన ఒక తల్లి ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంత చెప్పినా వినకుండా తన భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆగ్రహించిన భర్త ఆమెను, ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఇద్దరినీ కొడవలితో నరికి కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు తమిళనాడులోని ముమ్మలంపట్టి గ్రామానికి చెందిన హరికృష్ణ రైల్వేలో పనిచేస్తున్నాడు. ఇతని భార్య పేరు తంగమారి, ఈ దంపతులిద్దరికీ ఓ కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఉద్యోగ రీత్యా హరికృష్ణ ఎక్కువగా ఊరిలో ఉండకపోవడంతో అదే గ్రామానికి చెందిన పెరుమాల్ కు తంగమారితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసన భర్త, వారి బంధువులు పలుమార్లు హెచ్చరించినా తంగమారి ప్రవర్తనలో మార్పు రాలేదు. పైపెచ్చు భర్త ఇంట్లో ఉన్నప్పుడు కలవడం ఇబ్బందవుతుందని భర్త ఇంటికి వచ్చినప్పుడల్లా పాలల్లో నిద్రమాత్రలు ఇచ్చి నిద్రపుచ్చి ప్రియుడి దగ్గరకు వెళ్ళేది.

killed-wife

అయితే ఇటీవల కేరళ వరదల నేపథ్యంలో హరికృష్ణ ఇంటికి వచ్చాడు. హరికృష్ణ రాత్రి నిద్రకు ఉపక్రమిస్తుండగా, భార్య తంగమారి పాలలో మత్తు మాత్రలు కలిపి ఇచ్చింది. అయితే విషయాన్నీ ముందే పసిగట్టిన హరి కృష్ణ దాన్ని తాగినట్లుగా యాక్ట్ చేసాడు. అయితే ఈ విషయం తెలియని భార్య, భర్త నిద్రలోకి జారుకున్నాడని భావించి పెరుమాల్ కు ఫోన్ చేసింది. ఊరి బయట ఉన్న పత్తి తోటలో కలుసుకోవాలని భావించి ఇంటి తలుపులు దగ్గరికివేసి ఆమె అక్కడకు తోటకు బయలుదేరింది. ఇదంతా నిద్ర నటిస్తూ చూస్తున్న హరికృష్ణ భార్య ప్రవర్తనతో ఆగ్రహానికి లోనై వేట కొడవలి తీసుకుని వెంబడించాడు. చివరికి వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా దాడిచేశాడు. ఈ దాడిలో పెరుమాల్ అక్కడికక్కడే చనిపోయాడు. భార్య తంగమారి అక్కడి నుంచి పారిపోతుండగా, హరికృష్ణ వెంటాడి మరీ కొడవలితో నరికాడు. అయితే ఇప్పుడు క్షనికావేసంలో తీసుకున్న ఆ నిర్ణయం వల్ల ఆ ముగ్గురు పిల్లలు రోడ్డున పడాల్సిన పరిస్థితి.

wife-killed-husbend