పెళ్లయ్యి, స్కూలుకెళ్లే పాప ఉన్న మహిళ ప్రేమలో పడితే ? ఆమె ప్రియుడితో పారిపోవడానికి ప్రయత్నిస్తే ? ఈ విషయం చదువుతుంటేనే మన సమాజం ఎటు పోతుంది అనిపిస్తోందా ? కానీ తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో అదే జరిగింది. తన కూతుర్ని స్కూలు బస్సు ఎక్కించే క్రమంలో అనపర్తి పాత ఊరికి చెందిన వివాహితకు ఆ బస్సు క్లీనర్‌తో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. ఊళ్లోనే ఉంటే కష్టమని భావించిన వారిద్దరూ ఎక్కడికైనా వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ప్రియుడితో కలిసి పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ ఈ వ్యవహారాన్ని పసిగట్టిన ఆమె తండ్రి వెంకటేశ్వర రావు మందలించాడు. దీంతో ఆగ్రహించిన ఆమె ప్రియుడు వెంకటేశ్వరరావుతో ఆమె తండ్రి గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయాడు. గాయపడ్డ వెంకటేశ్వర రావును హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.