రాజస్థాన్‌లో అమానవీయకర సంఘటన చోటుచేసుకుంది. ఇంటిపక్కన.. ఉండే వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్మీర్‌కు చెందిన బాలిక ఎనిమిదో తరగతి చదువుకుంటుంది. బాలిక ఇంటిపక్కన ఒక వ్యక్తి.. డ్రైవర్‌గా పనిచేసేవాడు.
ఈ క్రమంలో.. ఈనెల బాలికను పనుందని ఒకసారి ఇంటికి రావాలని పిలిచాడు. పాపం.. ఒకే కాలనీలో ఉండేవాడు.. తెలిసిన వారే అని బాలిక అమాయకంగా అతగాడి ఇంటికి వెళ్లింది. అప్పుడు ఆ దుర్మార్గుడు .. బాలిక ఇంట్లోకి రాగానే వెంటనే తలుపులు వేసేశాడు. ఆ తర్వాత బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దుర్మార్గాన్ని వీడియో కూడా తీశాడు. ఎవరికైనా.. చెబితే వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఆ బాలిక షాక్‌తో ఎవరికి చెప్పకుండా ఉండిపోయింది. ఆ కామాంధుడు మాత్రం వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో బాలికను చూసి కాలనీవాసులు షాక్‌కు గురయ్యారు. ఆతర్వాత .. వీడియో ఉదంతాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు నిందితుడిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.