వదినతో ‘ఆ’ సంబంధం…దారుణ హత్య !

man murdered by brother for illicit relation

వదిన వరసయ్యే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లి గ్రామానికి చెందిన నూతలపాటి అంజనీరాజు(25) గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. అన్న వరసయ్యే సమీప బంధువు భార్యతో ఆ యువకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్న నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

murder

పోలీసుల కథనం ప్రకారం… ప్రకాశం జిల్లా, సంతమాగులూరు మండలం, గురిజేపల్లి గ్రామానికి చెందిన నూతలపాటి అంజనీరాజు(25) చిలకలూరిపేట పట్టణంలో నివసిస్తున్నాడు. యడవల్లిలోని గ్రానైట్‌ క్వారీలో మిషన్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగానే మంగళవారం తెల్లవారు జామున విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై చిలకలూరిపేట వైపు వస్తున్నాడు. యడవల్లి గ్రామ శివారులోని కృపా గ్రానైట్స్‌ వద్ద పెద్ద బండరాయి వద్ద కాపు కాచిన గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి మారణాయుధాలతో దాడి చేయడంతో అంజనీరాజు అక్కడికక్కడే మృతి చెందాడు.

murder
మృతుడికి రెండేళ్ల కిందటే వివాహమైంది. సమాచారం తెలుసుకున్న సర్కిల్‌ సీఐ యు.శోభన్‌బాబు, రూరల్‌ ఎస్‌ఐ పి.ఉదయ్‌బాబు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహం వద్ద పంచనామా నిర్వహించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుడి సోదరుడు నూతలపాటి హరికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసుల ప్రధమిక విచారణలో తేలినట్లు సమాచారం.

murder