తల్లితో సమానమని చెబుతున్నా వినకుండా పిల్లనిచ్చిన అత్త మీద రేప్

Man-rapes

మన దేశంలో నిర్భయలాంటి చట్టాలు తెచ్చినా ఆగడం లేదు. దేశవ్యాప్తంగా అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. కొందరు వావివరసలు మర్చిపోయి అయినవాళ్లపైనే అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. పిల్లనిచ్చిన అత్తపైనే కన్నేశాడో కామాంధుడు. వావివరసలు మర్చిపోయి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కృష్ణా జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. బాధితురాలు చెబుతున్న వివరాల ప్రకారం జగ్గయ్యపేటకు చెందిన మహిళ కంచికచర్ల మండలం కీసర గ్రామంలో ఉంటున్న పెద్ద కూతురి దగ్గరకు వెళ్లింది. ఆమె బాగోగులు తెలుసుకొని తిరిగి ఇంటికి వచ్చేందుకు బయల్దేరింది. ఈలోపు ఆమె అల్లుడు తాను జగ్గయ్యపేట వెళ్తున్నాని రమ్మని పిలిచాడు. అల్లుడే కదా అని ఆమె నమ్మి కారు ఎక్కింది. కారు వత్సవాయి మండలం భీమవరం దగ్గర టోల్‌గేట్ దగ్గరకు రాగానే అల్లుడు డ్రామా మొదలు పెట్టాడు. టోల్‌ ప్లాజా దగ్గరలో ఉన్న ఓ చిన్న రోడ్డుకు కారును తిప్పాడు. మెయిన్ రోడ్‌ వైపు వెళుతుండటంతో అత్తకు అనుమానం వచ్చింది. దీంతో ఇటు ఎందుకు వెళుతున్నావని అల్లుడ్ని ప్రశ్నించింది. టోల్‌ ఫీజు కట్టకుండా తప్పించుకోవచ్చని ఆమెకు చెప్పడంతో నమ్మేసింది. తర్వాత ఎన్నెస్పీ కాలువ కట్టపై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ కారు ఆపి అత్యాచారాని పాల్పడ్డాడు. తర్వాత జగ్గయ్యపేటలో ఆమె ఇంటి సమీపంలో దింపి వెళ్లిపోయాడట. దీంతో బాధితురాలు భర్తకు జరిగిన ఘటన గురించి చెప్పింది. అతడు వెళ్లి అల్లుడ్ని నిలదీయగా నిర్లక్ష్యంగా మాట్లాడడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. తాను తల్లితో సమానమని బతిమాలినా ఆ కామాంధుడు వదల్లేదని బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది.