ప్రేమ…బ్రేకప్…ఆ తర్వాత పోర్న్ పిక్స్ పంపి ?

facebook-cybercrime

అమర ప్రేమికుడిలా బిల్డప్ ఇచ్చిన ఆ 23 ఏళ్ల యువకుడి నిజస్వరూపం ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పడంతో బయటపడింది. వివరాల్లోకి వెళితే అహ్మదాబాద్ గాంధీనగర్‌లో అభిషేక్ శర్మ ఓ ప్రైవేట్ సంస్థలో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ ఆనంద్‌లో మెడిసిన్ చదువుతున్న ఓ యువతి వెంట పడ్డాడు. అతని మాయమాటలు నమ్మిన ఆ యువతి కమిట్ అయ్యింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకు తిరిగారు. ఇంతలో ఓ రోజు ఆమె వేరే యువకుడితో మాట్లాడుతూ కనిపించింది. అభిషేక్ లోని శాడిస్ట్ నిద్ర లేచాడు. ఆ కుర్రాడెవడు, నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటూ ప్రశ్నలు వేస్తుంటే ఆమె బ్రేకప్ చెప్పింది. అంతే తట్టుకోలేకపోయిన అభిషేక్ ఆమెపై పగబట్టాడు. సోషల్ మీడియాలోని ఓ ఫొటో షేరింగ్ సైట్‌ లో రకరకాల పేర్లతో నకిలీ ఐడీ అకౌంట్లు సృష్టించి వాటి ద్వారా న్యూడ్ ఫొటోలు, మెసేజ్‌లు ఆమెకు పంపసాగాడు. ఆమె అభిషేక్‌కి వార్నింగ్ ఇచ్చింది. ఇంకోసారి అలాంటివి పంపితే పోలీసులకు కంప్లైంట్ ఇస్తానంది. అభిషేక్ మరింత రెచ్చిపోయాడు. ఈసారి ఆమె ఫొటోలను… పోర్న్ ఫొటోలుగా మార్ఫింగ్ చేసి… ఆమె వాట్సాప్‌ అకౌంట్‌తోపాటూ కొన్ని పోర్న్ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేశాడు. ఆ విషయం ఆమెకు చెప్పి ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. తిన్నగా వెళ్లి అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది ఆమె. IP అడ్రెస్ ద్వారా ఆధారాలతో సహా కనిపెట్టిన పోలీసులు అభిషేక్‌ని అరెస్టు చేశారు.