నిండు సభలో మోడీని నిలదీసిన వ్యక్తిని…ఎవరెన్ని పెడార్థాలు తీసినా లెక్క చేయను

man stood up in the full house

రోజుకో ఫేస్‌బుక్ పోస్టుతో కాకరేపుతున్న టీడీపీ ఎంపీ కేశినేని నాని మళ్లీ సంచలనానికి తెరలేపారు. ఇవాళ మరో ఆసక్తికర పోస్ట్‌ ని ఆయన ఫేస్‌ బుక్‌ ద్వారా షేర్ చేశారు.అయితే ఈసారి ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించనప్పటికీ తన మనసులో మాటను సూటిగా బయటపెట్టారు. తాను ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదని.. భయం తన రక్తంలో లేదని, స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తినని, ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదని, నీతి, నిజాయితీ, వక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే నా నైజం. నిజాన్ని నిజమని చెబుతాను. అబద్ధాన్ని అబద్దమనే చెబుతాను. మంచిని మంచి అనే అంటాను. చెడును చెడు అనే అంటాను. న్యాయాన్ని న్యాయమని మాట్లాడతాను. అన్యాయాన్ని అన్యాయమని మాట్లాడతాను. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మాత్రమే తెలిసిన వాడిని. నిండు సభలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వాడిని నేను. నిండు సభలో మోడీని నిలదీసిన వ్యక్తిని, భయం నా రక్తంలో లేదు. రేపటి గురించి ఆలోచన అంతకంటే లేదు. ఎవరెన్ని పెడార్థాలు తీసిన, వీపరీతార్థాలు తీసిన లెక్క చేసే వాడిని కాదు’ అంటూ నాని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.