నయన్‌ మూవీనే మంచు లక్ష్మి చేస్తోందా?

Wife-Of-Ram-movie-same-Like

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో ‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ అనే చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం సైలెంట్‌గా పూర్తి చేయడం జరిగింది. ఈ చిత్రానికి మంచు లక్ష్మి ఒక నిర్మాత అవ్వడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. తాజాగా విడుదలైన టీజర్‌ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే ఒక సాదారణ గృహిణిగా మంచు లక్ష్మి కనిపించబోతుంది. ఆమె భర్త చనిపోవడంతో జీవితం అంతా చీకటి అయిన సమయంలో ఆమెకు తన భర్తది సహజ మరణం కాదని తెలుసుకుంటుంది. తన భర్త చావుకు కారణం అయిన వారు ఎవరు, వారికి కోర్టులో శిక్ష పడేలా ఎలా చేసింది అనేది ఈ చిత్రం కథగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

అచ్చు ఇదే కథ కాకున్నా కాస్త అటు ఇటుగా బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘కహాని’ చిత్రం అదేనండి తెలుగులో రీమేక్‌ అయిన నయనతార ‘అనామిక’ చిత్రం కథలా ఉంది. ఆ చిత్రంలో తన భర్త కిడ్నాప్‌ అయితే అతడిని వెదుకుతూ తిరుగుతుంది. ఈ చిత్రంలో మాత్రం ఆమె భర్తను చంపిన వారిని కనిపెట్టే విధంగా కథ సాగుతుంది. నరేషన్‌ పరంగా రెండు కథలు కూడా సేమ్‌ టు సేమ్‌ సాగుతాయని అనిపిస్తుంది. అనామిక చిత్రంలో నయనతారకు వైభవ్‌ సాయంగా ఉంటే ఈ చిత్రంలో మాత్రం మంచు లక్ష్మికి ప్రియదర్శి హెల్ప్‌ చేసేవాడిగా కనిపించబోతున్నాడు. మొత్తానికి మంచు లక్ష్మి సేమ్‌ అదే కథతో ఎలా ఈ చిత్రాన్ని తీసింది, ఏ నమ్మకంతో ఈ చిత్రాన్ని ఒప్పుకుందో అర్థం అవ్వడం లేదు.